Header Banner

ప్రపంచ చరిత్రపై లోతైన పరిశీలన.. దగ్గుబాటి రచనలో కీలకాంశాలు! పుస్తక ఆవిష్కరణలో సంచలన వ్యాఖ్యలు!

  Thu Mar 06, 2025 13:16        Politics

విశాఖలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "పుస్తకం ఎలా రాశావని చాలా మంది నన్ను అడిగారు. అసలు పుస్తక రచనకు ముందు చాలా కృషి జరిగింది. నేను సైన్స్ స్టూడెంట్‌ను, ఎంబీఏ చేశాను. కానీ సోషల్ స్టడీస్‌పై అంతగా అనుభవం, పరిజ్ఞానం లేదు. చరిత్ర తెలియకుండా పుస్తకం ఎలా రాయాలని ఆలోచించాను. పుస్తకాలు ఎక్కడ దొరికినా కొనుక్కునేవాణ్ని, గొప్ప నాయకుల చరిత్రలు కూడా అభ్యసించడం మొదలుపెట్టాను. రాష్ట్ర విభజనకు ముందు చరిత్రేంటి అనే విషయాలు తెలుసుకున్నాను. ప్రపంచ చరిత్ర రాయాలంటే చాలా విషయాలు తెలుసుకోవాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!


ప్రపంచ నేతలు, తత్వవేత్తల గురించి పూర్తిగా అధ్యయనం చేశాను. చరిత్ర గతినే మార్చిన మహానుభావుల పాలనను క్షుణ్ణంగా పరిశీలించాను. జీవ పరిణామ క్రమం, మనిషి పుట్టుక, రాతియుగం వంటి అంశాలను ప్రస్తావించాను. ప్రాచీన సంస్కృతి, ఈజిప్టు, మెసపటోమియా, సింధు నాగరికతల గురించి వివరించాను. పురాతన గ్రీస్, రోమ్ నాగరికతలపైనా పుస్తకంలో పొందుపరిచాను. ఫ్రాన్స్, జర్మనీ ఎలా ఏర్పడ్డాయో, ఇంగ్లీష్ ఎలా పుట్టిందో వంటి పరిణామాలను వరుస క్రమంలో అందించాను. మతాలు, మతకలహాల వంటి అంశాలను కూడా సోదాహరణంగా వివరించాను" అని చెప్పారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #daggubati #books #todaynews #writer #flashnews #latestnews